బర్త్ డే స్పెషల్ : అలియా భట్

బర్త్ డే స్పెషల్ : అలియా భట్

మహేష్ భట్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అలియా... తక్కువ కాలంలోనే హీరోయిన్ గా నిలదొక్కుకుంది.  భారీ చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్న అలియా.. బాలీవుడ్ తో పాటు సౌత్ చిత్రాలపై కూడా కన్నేసింది.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది అలియా.  

ఒకవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు అలియా నిర్మాతగా కూడా మారబోతున్నది.  త్వరలోనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. దానిద్వారా సినిమాలు నిర్మించాలని అనుకుంటోంది.  నిర్మాణ రంగానికి మాత్రమే పరిమితం అవుతానని.. దర్శకురాలిగా మారే అవకాశం లేదని చెప్తోంది.  ఇప్పటి వరకు ఆరు సినిమాల్లో పాటలు పడింది అలియా.  2019 అలియాకు బాగా కలిసి వచ్చింది.  2019 లో వచ్చిన గల్లీబాయ్ సినిమా సూపర్ హిట్ అయింది.  బ్రహ్మాస్త్ర, కళాంక్ తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయ్.