కింగ్ నాగార్జునకు దేవదాస్ బర్త్ డే గిఫ్ట్

కింగ్ నాగార్జునకు దేవదాస్ బర్త్ డే గిఫ్ట్

విక్రమ్ సినిమాతో తెలుగు సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాగార్జున శివ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.  మజ్ను, మణిరత్నం గీతాంజలి సినిమాలు నాగార్జున కెరీర్ ను ఓ మలుపు తిప్పిన సినిమాలుగా చెప్పొచ్చు.  హలో బ్రదర్ సినిమా ద్వారా మాస్ హీరోగా గుర్తింపు పొందారు.  ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నారు.  నిన్నేపెళ్లాడుతా, మన్మధుడు సినిమాలతో అమ్మాయిల మనసును దోచుకున్నాడు.  కింగ్ సినిమా నాగార్జున కెరీర్ ను మరో మలుపు తిప్పిన సినిమా.  సాంఘిక సినిమాలే కాకుండా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి రస చిత్రాల్లో నటించి తనలో ఓ భక్తుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు నాగార్జున.  ఇటీవలే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎలాంటి హిట్టయిందో చెప్పక్కర్లేదు.  నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించాడు.  

ప్రస్తుతం నాగార్జున.. నాని తో కలిసి దేవదాస్ సినిమా చేస్తున్నాడు.  ఇందులో నాగ్ డాన్ పాత్రను పోషిస్తున్నాడు.  59 సంవత్సరాల వయసులో కూడా నాగార్జున యంగ్ గా కనిపించడం విశేషం.  వయసు పెరిగే కొలది ఆయన అందం కూడా పెరగడం విశేషం.  ఆగష్టు 29 మన్మధుడు నాగార్జున పుట్టిన రోజు.   నాగ్ పుట్టినరోజు పురస్కరించుకొని దేవదాస్ స్టిల్ ఒకటి యూనిట్ రిలీజ్ చేసింది.  లాంగ్ కోట్, హ్యాట్ పెట్టుకొన్న నాగార్జున చాలా యంగ్ గా కనిపించారు.  స్టైలిష్ గా ఉన్న ఈ స్టైల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. వయసుతో పాటు కింగ్ అందం పెరుగుతున్నదని కామెంట్లు వస్తున్నాయి.