హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్

హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అందరికి పంచ్ డైలాగులు గుర్తుకు వస్తాయి.  తన డైలాగుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న రైటర్, దర్శకుడు త్రివిక్రమ్.  చిన్నా రైటర్ గా సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి స్టార్ దర్శకుడిగా ఎదిగాడు.  

స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్ గా తెరవెనుక మెప్పించిన త్రివిక్రమ్... నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు.  అతడు సినిమా మొదట రావాల్సి ఉన్నా.. మహేష్ బాబు బిజీకావడంతో మొదట నువ్వే నువ్వే సినిమా వచ్చింది.  సున్నితమైన కథాంశంతో మెప్పించింది.  మొదటి సినిమాతోనే త్రివిక్రమ్ తనదైన శైలిలో మెప్పించాడు. అందులో ఆర్ట్స్ కామర్స్ అనే సాంగ్ ను కూడా పాడి మెప్పించాడు.  అతడు సినిమాతో త్రివిక్రమ్ తన స్థాయిని పెంచుకున్నాడు.  డైరెక్ట్ అంటే ఇలా ఉంటుందా అని విధంగా సినిమా తీశాడు..  

ఆ సినిమా ఇప్పటికి బుల్లితెరపై వస్తే.. ప్రతి ఒక్కరు తప్పకుండా చూస్తుంటారు.  అనంతరం వచ్చిన ఖలేజా సినిమా యావరేజ్ గా నిలిచింది.  జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అ ఆ, ఇప్పుడు అల వైకుంఠపురం.. ఇలా ప్రతి సినిమాకు తన పరిధి పెంచుకుంటూ వెళ్తున్నాడు.  త్రివిక్రంతో సినిమా చేయడం కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు.  ఎందుకంటే అయన నడిచే ఒక ఎన్ సైక్లోపీడియా అందుకే ఇండస్ట్రీలో అందరు ఆయన్ను గురూజీ అని పిలుస్తుంటారు.  

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ అనుబంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత రాజకీయాల్లో బిజీగా ఉన్నా... బయట ఈ ఇద్దరు నిత్యం కలుసుకుంటూనే ఉంటారు.  అలాంటి మనస్తత్వం కలిగిన త్రివిక్రమ్ పుట్టినరోజు నేడు.  ఒక దర్శకుడి పుట్టినరోజును అభిమానులు పండుగలా చేసుకుంటారు అది త్రివిక్రమ్ గొప్పదనం.  త్రివిక్రమ్ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.