హ్యాపీ బర్త్ డే గురూజీ

హ్యాపీ బర్త్ డే గురూజీ

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రేక్షకులంతా ఆయనను మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటూ ఉంటారు. నేడు ఈ టాప్ డైరెక్టర్ పుట్టిన రోజు .  నువ్వే నువ్వే అనే ప్రేమ కథా చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది. చేతిలో ఎంత వర్త్ ఉన్నా.. దానికి లక్ కూడాఉండాలి. వెనక ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకపోయినా, కలాన్ని నమ్ముకొని కాలానికి ఎదురుగా ముందుకు సాగాడు. చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్న త్రివిక్రమ్..మాటల రచయితగా మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా.. మాటల యొక్క గొప్పదంతో.. స్టార్ హీరోలు, దర్శకుడు పొందిన స్థాయిని అందుకున్నాడు. తొలిసినిమా నువ్వే నువ్వే తో దర్శకుడిగా తన తాను నిరూపించుకున్న త్రివిక్రమ్.. అతడు సినిమాతో తన స్థాయి ఏమిటో.. తన సినిమా ఎలా ఉంటుందో సినిమా రంగానికి చూపించాడు. ఖలేజా, జులాయి, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ ఆ,  వచ్చిన అరవింద సమేత  తర్వాత అలవైకుంఠపురంలో సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్త్వం త్రివిక్రమ్ ది. త్వరలో ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్.