హ్యాపీ బర్త్ డే విజయ్ సేతుపతి 

హ్యాపీ బర్త్ డే విజయ్ సేతుపతి 

తమిళ్ సినిమా యాక్టర్లు ఇప్పటికి మనకు చాలామంది గురించి పెద్దగా తెలియదు.  తమిళ్ ఇండస్ట్రీలో మంచి ఉన్నప్పటికీ, తెలుగు సినిమా వరకు వచ్చే సరికి చాలామంది బోల్తా కొడుతుంటారు.  అందుకే ఆ నటులు అక్కడితోనే ఆగిపోతుంటారు. రజినీకాంత్, సూర్య, కార్తీ, ధనుష్, విజయ్, విక్రమ్ వంటి నటులు తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఈ వరసలో ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా జాయిన్ అయ్యాడు.  

అకౌంటెంట్ గా జీవితాన్ని ఆరంభించిన విజయ్ సేతుపతి, దుబాయ్ లో కొన్నాళ్ళు పనిచేశారు.  కానీ, ఆ పని నచ్చక, సొంతంగా డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎదుగుతున్న సమయంలో సినిమా అవకాశం వచ్చింది.  అలా వచ్చిన అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకున్నారు.  2010లో మొదటి లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది.  ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో విజయ్ సేతుపతి వెలుగులోకి వచ్చారు.  ఆ తరువాత విజయ్ సేతుపతి 2012లో సుందర పాండియన్ సినిమాలో విలన్ రోల్ చేసి వావ్ అనిపించుకున్నారు.  అప్పటి నుంచి వరుసగా సినిమా రంగంలో హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు.  ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం సినిమా రంగంలో కూడా విజయ్ సేతుపతి దూసుకుపోతున్నారు.  తెలుగులో ఉప్పెన సినిమా చేస్తున్నారు.  కాగా, నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు.  కనుమ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ సేతుపతి మరిన్ని పుట్టినరోజు పండగలు జరుపుకోవాలని కోరుకుందాం.