హ్యాపీ బర్త్ డే వివి వినాయక్ 

హ్యాపీ బర్త్ డే వివి వినాయక్ 

టాలీవుడ్లో మాస్ చిత్రాలకు మార్గదర్శకుడు వివి వినాయక్.  ఎన్టీఆర్ తో అయన తీసిన ఆది సినిమా మాస్ హిట్ అయ్యింది.  అప్పటి వరకు ఎన్నో మాస్ సినిమాలు వచ్చాయి.  కానీ, రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వచ్చినా.. ఆది లాంటి హిట్ కొట్టలేదు.  ఆది తరువాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది.  తన మొదటిసినిమాతోనే మాస్ హిట్ కొట్టాడు వినాయక్.  ఈ సినిమాను ఆయన తీసిన విధానం, ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  

ఆ తరువాత నితిన్ తో తీసిన దిల్ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లింది.  ఎలాంటి సబ్జెట్ తో అయినా సినిమా తీయగలనని చెప్పకనే చెప్పాడు వినాయక్.  అప్పటి నుంచి నిర్మాత రాజు దిల్ రాజుగా మారిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ తో ఠాగూర్, అల్లు అర్జున్ తో బన్నీ, వెంకటేష్ తో లక్ష్మి, ప్రభాస్ తో యోగి, రవితేజ తో కృష్ణా, ఎన్టీఆర్ తో అదుర్స్, మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలు తీశాడు.  ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవిని అద్భుతంగా చూపించాడు.  పాత చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా సినిమాను తీసి మెప్పించాడు.  ప్రస్తుతం ఈ దర్శకుడు నటుడిగా మారి సీనయ్య సినిమా చేస్తున్నాడు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వినాయక్ మాస్ నటుడిగా కనిపిస్తున్నాడు. ఎదో సరదాగా కాకుండా సినిమాను సీరియస్ గా తీస్తున్నారు.  నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఈ లుక్ అందరిని ఆకట్టుకుంది.  దర్శకుడుగా సక్సెస్ సాధించిన ఈ దర్శకుడు హీరోగా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం.  అక్టోబర్ 9 వినాయక్ పుట్టినరోజు.  ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.