ప్రేమికుల రోజు.. బజరంగ్‌దళ్‌ హెచ్చరికలతో మారిన లవర్స్‌ స్పాట్లు..

ప్రేమికుల రోజు.. బజరంగ్‌దళ్‌ హెచ్చరికలతో మారిన లవర్స్‌ స్పాట్లు..

ప్రేమికుల రోజు వచ్చేసింది... ఫిబ్రవరి 7న రోజ్‌ డేతో మొదలై... 8న ప్రపోస్‌ డే, 9న చాకొలేట్‌ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్‌ డే, 12న కిస్సెస్‌ డే, 13న హగ్గింగ్‌ డే... చివరగా 14న వాలెంటైన్‌ డేగా ప్రేమికులు మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. రకరకాల గిఫ్ట్ లతో మనసు దోచుకుంటున్నారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా.... ఆ గూటి పక్షులంతా సెలబ్రేషన్‌లో మునిగిపోయారు. ఆకట్టుకునే గిఫ్ట్‌లు, ఆకర్షణీయమైన డిజైన్లతో... సర్ ప్రైజ్ చేసేందుకు లవ్ బర్డ్స్ సిద్ధమయ్యారు. ప్రేమపక్షలు అనగానే వెంటనే పార్క్‌లు గుర్తుకు వస్తాయి.. అయితే, బజరంగ్‌దళ్‌ హెచ్చరికలతో  ప్రేమికులు తమ మీటింగ్ స్పాట్లుగా.. రెస్టారెంట్లు, పబ్‌లు, కెఫేలను ఎంచుకుంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, పబ్‌లు పదిరోజుల ముందు నుంచే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేశాయి. 

వాలెంటైన్స్‌ డే... రెండు మనసులు ఒక్కచోట చేరి ప్రేమను పంచుకునే మధురమైన జ్ఞాపకం. లవర్స్ ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకునేందుకు బహుమతులతో వాలిపోతుంటారు. ఆ ప్రేమ కానుకగా సువాసనలు వెదజల్లే పూలు, కళ్లు జిగేల్‌ మనిపించే టాయ్స్‌, ఫ్రేమ్స్‌, గ్రీటింగ్‌ కార్డ్స్‌, కీచైన్లు, చాక్లెట్లు... ఇలా రకరకాల గిఫ్ట్‌తో తనలోని ప్రేమను ఇంప్రెస్ చేసుకుంటున్నారు లవ్ బర్డ్స్. అందమైన బొమ్మలకు తోడు భావుకత ఉట్టిపడే కొటేషన్లతో బహుమతులు, గ్రీటింగ్‌ కార్డ్స్‌ కేకపుట్టిస్తున్నాయి. కార్డ్‌ డిజైన్‌, ధర ఎంత అన్నది ముఖ్యం కాదు... అందులో ఉండే మెసేజ్‌ ఇంపార్టెంట్ అంటున్నారు ప్రేమికులు. ఈ వాలెంటైన్‌ డే.. వాణిజ్య, వ్యాపార వర్గాలకు లాభాలపంట పండిస్తోంది. ఫ్లవర్‌ బొకేస్‌, గ్రీటింగ్‌ కార్డ్స్‌, గిఫ్ట్స్‌, జ్యువెలరీషాపులు, వస్త్ర దుకాణాలతోపాటు, రెస్టారెంట్లు, పబ్‌లలో వ్యాపారాలు జోరందుకున్నాయి.