హ్యాపీ వెడ్డింగ్ డే చై.. సామ్

హ్యాపీ వెడ్డింగ్ డే చై.. సామ్

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో ఒకరు నాగార్జున.. అమల అని చెప్తారు.  ఇప్పుడు ఇదే కుటుంబంలో మరో కపుల్ వచ్చి చేరింది.  వారే నాగ చైతన్య.. సమంత.  నాగ చైతన్య సమంతలు ఏం మాయ చేశావే సినిమాలో కలిసి నటించారు.  అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది.  ఆటో నగర్ సూర్య సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.  కానీ, ఎప్పుడు ఈ జంట తమ ప్రేమ గురించి బయటకు చెప్పలేదు.  ఎంగేజ్మెంట్ కు కొద్ది రోజుల ముందు వరకు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని బయటకు తెలియదు.  

గతేడాది అక్టోబర్ 6 వ తేదీన ఇద్దరు ఇరు కుటుంబాల సాక్షిగా ఒక్కటయ్యారు.  నేటికీ వీరి వివాహం జరిగి ఏడాది అయింది.  ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు.  తమ మొదటి వెడ్డింగ్ డే రోజున ఈ శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ అనే సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా ఈరోజు ప్రారంభమైంది.  భార్య భర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట.  పెళ్ళైన తరువాత కూడా సమంత వరస హిట్స్ తో దూసుకుపోతున్నది.  మరోవైపు నాగ చైతన్య కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.