హ్యాపీ బర్త్‌ డే ఎవర్ గ్రీన్ రమ్యకృష్ణ

హ్యాపీ బర్త్‌ డే ఎవర్ గ్రీన్ రమ్యకృష్ణ

తెలుగు ఇండస్ట్రీలో రమ్యకృష్ణ యమా బిజీగా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత అత్తగా, తల్లిగా నటిస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక బాహుబలి చిత్రంలో ‘శివగామి’గా జనాల మైండ్స్ లో ఫిక్స్ అయిపొయింది. 1985లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించిన ఆమె 1989లో వచ్చిన సూత్రధారులు సినిమాతో మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పోయినట్టే అంటూ ఆమెది ఐరన్ లెగ్ అని ప్రచారంలోకి వచ్చింది.

కానే 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేసి ఐరెన్ లెగ్ టు గోల్డెన్ లెగ్ ని చేశాయి. తర్వాతి కాలంలో దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులకి తల్లయింది. ఇక ఈమె చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. 'బాహుబలి' సినిమా మరో ఎత్తు.

'శివగామి'గా రమ్యకృష్ణ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రాజమాతగా ఆమె పర్‌ఫామెన్స్‌ అందన్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. రాజమాత కాదు ఇండస్ట్రీకే మాతగా శివగామిని అభివర్ణించొచ్చు. ఆ పాత్రకి ఆమె తప్ప మరొకర్ని ఊహించుకోవడం చాలా కష్టం. గతంలోనూ ఈ తరహా పర్‌ఫామెన్స్‌ పాత్రలు చాలానే చేసింది రమ్యకృష్ణ. ఇప్పుడు తెలుగు,తమిళ ఇండస్ట్రీలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది రమ్యకృష్ణ. ఈ రోజు రమ్యకృష్ణ పుట్టినరోజు. ముందు ముందు సూపర్ హిట్ సినిమాల్లో నటించాలని ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో చేసుకోవాలని ఎన్ టీవీ కోరుకుంటోంది.