ఫేస్‌బుక్, వాట్సప్‌తో అమ్మాయిలకు వల...

ఫేస్‌బుక్, వాట్సప్‌తో అమ్మాయిలకు వల...

సోషల్ మీడియా మానవసంబంధాలను పెంచడం ఏమో కానీ... అడ్డదారులకు వేదికలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని యువతులు, మహిళలను వేధించేవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు, అమ్మాయిల ఫొటోలను అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు వీర నారాయణ అనే కీచకుడు... మహిళల ఫిర్యాదుపై అవనిగడ్డకు చెందిన మట్టి వీర నారాయణను అదుపులోకి తీసుకున్నారు నున్న పోలీసులు... పలువురు మహిళను ఇదే విధంగా వేధిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.