టీ 20 ప్రపంచ కప్ ఆడటానికి నేను సిద్ధం అంటున్న హర్భజన్...

టీ 20 ప్రపంచ కప్ ఆడటానికి నేను సిద్ధం అంటున్న హర్భజన్...

చివరిసారిగా 2016 లో ఆసియా కప్ సందర్భంగా భారతదేశం తరపున ఆడిన హర్భజన్, మళ్ళీ ఇప్పుడు  జాతీయ జెర్సీని అతి చిన్న ఫార్మాట్‌లో ధరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. "నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఐపీఎల్ లో బాగా బౌలింగ్ చేయగలిగితే చాలు, ఇది బౌలర్లకు చాలా కష్టమైన టోర్నమెంట్, ఎందుకంటే మైదానం చిన్నది, మరియు ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఐపీఎల్ ‌లో ఆడతారు. వారికి వ్యతిరేకంగా బౌలింగ్ చేయడం చాలా సవాలుగా ఉంది మరియు మీరు ఐపీఎల్ లో వారికి వ్యతిరేకంగా బాగా చేయగలిగితే, మీరు అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా రాణించగలరు. నేను పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో ప్రధానంగా బౌలింగ్ చేశాను మరియు వికెట్లు సాధించాను ”అని హర్భజన్ అన్నాడు.

2017 లో తన చివరి లిస్ట్ ఎ మ్యాచ్‌లో తమిళనాడు పై ఇండియా ఎ కు నాయకత్వం వహించి, అదే సంవత్సరం తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడిన హర్భజన్, అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి టీ 20 బ్యాట్స్మెన్స్ ను అవుట్ చేయడానికి తనలో ఇంకా సత్తా ఉంది అని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని జట్లలో ఐపీఎల్ లో ఆడేటటువంటి నాణ్యమైన ఆటగాళ్ళు ఉండరు, ఇక్కడ ప్రతి జట్టులో టాప్ ఆటగాళ్లు ఉంటారు. ఐపీఎల్ కారణంగానే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు చాలా మంచి బ్యాటింగ్ లైనప్‌లు వచ్చాయి అని హర్భజన్ అన్నారు. అయితే చూడాలి మరి ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచ కప్ జట్టులో హర్భజన్ స్థానం దక్కించుకుంటాడా... లేదా అనేది చూడాలి.