చైనా కరోనాను ఎందుకు వ్యాప్తి చెందించిందో చెప్పిన హర్భజన్... 

చైనా కరోనాను ఎందుకు వ్యాప్తి చెందించిందో చెప్పిన హర్భజన్... 

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పెరుగుతున్న ముప్పుతో ప్రపంచం వణికిపోతుండటంతో, ప్రముఖ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చైనా పై తన కోపాన్ని చూపించాడు. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, హర్భజన్ "చైనా ప్రజలను" వారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రశ్నలు వేస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చేయడం ద్వారా "ప్రపంచాన్ని ప్రమాదంలో పడేలా" చేశారని ఆరోపించారు. హర్భజన్ ''చైనా మే 28 న కొత్త కరోనావైరస్ కేసులను నివేదించలేదు" అనే కథనాన్ని రీట్వీట్ చేసారు. అందులో...  "ఇదే చైనా ప్రణాళిక .. ఈ కరోనా వైరస్‌ను ప్రపంచమంతటా వ్యాప్తి చెందించడం.. ప్రతి ఒక్కరూ దీనితో బాధపడుతుండగా వారు సంతోషంగా కూర్చుని చూస్తున్నారు..పిపిఇ కిట్లు, మాస్క్ మొదలైనవి ప్రపంచం మొత్తానికి తయారు చేసి వారి ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసుకుంటున్నారు' అని తెలిపాడు. అంతకుముందు, పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కరోనావైరస్ వ్యాప్తికి చైనాపై విరుచుకుపడ్డాడు, 'ఏదైనా మరియు ప్రతిదీ తినడం వలెనే ఇలా జరిగిందని  తాను నిజంగా కోపంగా ఉన్నానని, చైనీయులు ప్రపంచాన్ని పణంగా పెట్టారని అక్తర్ అన్నారు.