పోలీసుల పై దాడి... హర్భజన్ ఆగ్రహం..

పోలీసుల పై దాడి... హర్భజన్ ఆగ్రహం..

ప్రస్తుతం మన దేశం లో కరోనా కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసందే. అత్యవసర సమయాల్లో మినహాయించి ప్రజలు బయటికి రాకూడదని చెప్పారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా కొంత మంది ప్రజలు బయటికి వస్తున్నారు. అయితే అంతే కాకుండా మరి కొందరు ఏకంగా పోలీసుల పైనే దాడికి పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం పైన భారత బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. హర్భజన్  తన ట్విట్టర్ లో కొంతమంది పోలీస్ పైన దాడి చేస్తున్న వీడియోను పోస్ట్ చేసాడు. ఇంకా ఆ పోస్ట్ లో... ''పోలీసుల పట్ల మన వైఖరిని మనం మార్చుకోవాలి. మనల్ని కాపాడటానికి వారు తమ ప్రాణాలను పెడుతున్నారని మర్చిపోకండి. వారికి కుటుంబాలు కూడా ఉన్నాయి, కాని వారు దేశం కోసం తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు..మనందరం ఇంట్లోనే ఎందుకు ఉండలేము" అంటూ ప్రశ్నించాడు. అయితే హర్భజన్ మొదటి నుండి కరోనా పట్ల ప్రజలకు అవగాహనా కల్పిస్తూనే ఉన్నాడు.