హర్భజన్ కు షాక్ ఇచ్చిన కరెంట్ బిల్..

హర్భజన్ కు షాక్ ఇచ్చిన కరెంట్ బిల్..

ఈ మధ్య కరెంట్ కంటే ఎక్కువగా ప్రజలకు కరెంట్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి. సామాన్య ప్రజల నుండి సెలబ్రేటిలవరకు లక్షల్లో కరెంట్ బిల్ రావడం మనం చూస్తూనే ఉన్నం. కొన్నిసార్లు కోట్లలో కూడా వస్తుంది. ఇంతకముందు హీరోయిన్ తాప్సీకి 36 వేల కరెంట్ బిల్ పంపారు అధికారులు. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఇంత బిల్ ఏంటి అని తాప్సీ అడిగింది. అయితే ఇప్పుడు అదే అనుభవాన్ని ఎదుర్కున్నాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్. తనకు వచ్చిన  కరెంట్ బిల్ చూసి షాక్ అయిన హర్భజన్ దానిని ట్విట్టర్ లో పెట్టాడు. అందులో తనకు 33,900 కరెంట్ బిల్ వచ్చిందని ఇది తన్నకు మాములుగా వచ్చే దానికంటే ఏడింతలు ఎక్కువ అని తెలిపాడు. అలాగే తన బిల్లులో ఇతరులది కూడా కలిపేశారా అంటూ ఎలక్ట్రిసిటీ బోర్డును నిలదీశారు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు హర్భజన్.