ధోనీకి స్వేచ్ఛ ఇవ్వండి.. విధ్వంసాన్ని చూడాలనుంది!

ధోనీకి స్వేచ్ఛ ఇవ్వండి.. విధ్వంసాన్ని చూడాలనుంది!

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచకప్‌లో వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు సీనియర్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌.. టీమిండియాలో ఫోర్త్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై ఓ వైపు తీవ్రమైన చర్చ... మరోవైపు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, దీనిపై స్పందించిన హర్భజన్‌ సింగ్‌.. ''వరల్డ్‌కప్‌లో ధోనీకి వీలైనంత స్వేచ్ఛ కావాలి...! అది బౌలింగ్‌ సూచనల విషయంలో కావొచ్చు..! బ్యాటింగ్‌ కావచ్చు..!ధోనీని ఇదే స్థానంలో పంపాలి అనే నియమాలేవీ పెట్టుకోకుండా ఉంటే మంచిందన్నాడు. ఇక ధోనీతో పాటు హార్దిక్‌ పాండ్యకు కూడా ఇది వర్తిస్తుందన్నారు భజ్జీ.. ఈ ఇద్దరికీ స్వేచ్ఛ ఇస్తే మరింత బాగా రాణించగలరు. ఇందుకు ఇటీవల జరిగిన ఐపీఎల్‌ ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. వీరిద్దరి దగ్గర్నుంచి వీలైనన్ని సిక్స్‌లు ఆశిస్తున్నాను. బౌలర్లపై ధోనీ విధ్వంసాన్ని చూడాలనుకుంటున్నాను. బ్యాటింగ్‌ శైలి విషయంలో మేనేజ్‌మెంట్‌ వీరిద్దరికీ లైసెన్సులిచ్చేయాలి. వారి మీద ఎలాంటి షరతులు పెట్టకూడదని అభిప్రాయపడ్డాడు హర్భజన్‌ సింగ్‌.