సిఎస్కే నుండి తప్పుకున్నట్లు ప్రకటించిన హర్భజన్...

సిఎస్కే నుండి తప్పుకున్నట్లు ప్రకటించిన హర్భజన్...

కరోనా కారణంగా ఐపీఎల్ 2020 చాలా ఆలస్యంగా యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్య ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఆటగాళ్లు లేని లోటు జట్టులో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ సరైన సమయంలో ఏప్రిల్ లోనే జరుగుతుంది అని బీసీసీఐ ప్రకటించింది. ఇక తాజాగా హర్భజన్ సింగ్  ఐపీఎల్ 2021 ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి తప్పుకున్నట్లు ప్రకటించించాడు. తన ట్విట్టర్ లో '' చెన్నై సూపర్ కింగ్స్ తో నా ఒప్పందం ముగిసింది. ఈ జట్టు కోసం ఆడటం గొప్ప అనుభవం ఇచ్చింది... ఆల్ ది బెస్ట్ సిఎస్కే'' అని పోస్ట్ చేసాడు. అయితే 2017 వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ ను 2018 ఐపీఎల్ వేలంలో చెన్నై కొనుగోలు చేసింది.