పెళ్ళికి ముందే తండ్రి కాబోతున్న పాండ్యా..!

పెళ్ళికి ముందే తండ్రి కాబోతున్న పాండ్యా..!

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో సోషల్  మీడియాలో పోస్ట్ చుసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అబిమానులు షాక్ కావడానికి కారణం పాండ్యకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే  అతడు ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను హార్దిక్‌ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారి నిశ్చితార్ధ విషయాన్ని ప్రకటించారు కూడా ఇక ఇప్పుడు పెళ్లి విషయం చెబుతాడనుకున్న అభిమానులకు తన ప్రేయసి ప్రెగ్నెన్సీ విషయం చెప్పి అవాక్కయ్యేలా చేసాడు. ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేశాడు. ‘తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నా. ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. దాంతో పాండ్యాకు క్రికెటర్లు విరాట్, రవి శాస్త్రి తో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.