హార్దిక్ పాండ్యపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు

హార్దిక్ పాండ్యపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యను వివాదాలు చుట్టుముట్టినప్పటికీ అతడు హీరోలా వాటన్నింటినీ దాటుకుని తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నాడని టీమిండియా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాండ్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల జరిగిన వివాదంతో పాండ్య కెరీర్ గురించి చాలా మంది విచారించారని, అందులో నేను కూడా ఉన్నానని తెలిపారు. నీ పాండ్య వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు. 'కాఫీ విత్ కరణ్' టాక్‌ షో తర్వాత విమర్శకులు అతడి మానసిక స్థితిని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ అతడు ఇంత త్వరగా బయటపడతాడని అనుకోలేదని వ్యాఖ్యానించారు. పాండ్య నిజమైన హీరో. అతడు జట్టులోకి తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇప్పుడు పాండ్యకు మరో పాండ్య తోడయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో అతడు ప్రభావం చూపలేనంత మాత్రాన తక్కువగా అంచనా వేయలేనని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నారు.