వైద్యులకు కృతజ్ఞతలు చెప్పిన పాండ్యా, స్టాంకోవిక్...

వైద్యులకు కృతజ్ఞతలు చెప్పిన పాండ్యా, స్టాంకోవిక్...

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొడుకు జూనియర్ పాండ్యా ఈ ప్రపంచం లోకి వచ్చిన విషయం తెలిసిందే. పాండ్యా కు కాబోయే భార్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ జూలై 30 న ఆసుపత్రిలో పండంటి అబ్బాయికి జన్మనివ్వడంతో  హార్దిక్ , స్టాంకోవిక్ మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు. అయితే నిన్న పాండ్యా తమ కుమారుడు జన్మించిన ముంబై ఆసుపత్రిలో వైద్యులతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే తమ కొడుకును ఈ ప్రపంచం లోకి తీసుక వచ్చినందుకు పాండ్యా,  స్టాంకోవిక్ వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో సామజిక దూరాన్ని పాటిస్తూ హార్దిక్ మరియు నటాసా కేక్ కటింగ్ చేసారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను హార్దిక్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ కు "ఆనంద్ లోని ఆకాంక్ష ఆసుపత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు!" అని హార్దిక్ పాండ్యా క్యాప్షన్ ఇచ్చాడు.