పాండ్యా ఔట్‌.. షమీ ఇన్

పాండ్యా ఔట్‌.. షమీ ఇన్

వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుకు భారత స్టార్ ఆటగాడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. గత సంవత్సరం ఇర్మా తుఫాను బీబత్సవం చేయడంతో కరేబియన్‌లోని పలు క్రికెట్‌ స్టేడియాలు ధ్వంసమయ్యాయి. వాటిని పునర్మించేందుకు చారిటీ మ్యాచ్ నిర్వహించి విరాళాలు సేకరించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలో మొదట ఎంపికయిన పాండ్య.. తీవ్ర వైరల్‌ జ్వరంతో బాధపడుతుండటంతో వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు నుండి తప్పుకున్నాడు. పాండ్య స్థానంలో భారత పేసర్‌ మహ్మద్‌ షమీ ఎంపికయ్యాడు. మరోవైపు ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ రషీద్‌కు జట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్‌ లార్డ్స్‌ వేదికగా మే 31న వెస్టిండీస్‌ జట్టుతో.. ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడుతుంది. వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ప్రతి దేశ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఈ టీ-20కి ఐసీసీ ఇప్పటికే  అంతర్జాతీయ హోదా ఇచ్చింది.

వరల్డ్‌-11 జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), షకీబుల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌, తిసార పెరీరా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, లూక్‌  రోంచి, మెక్లినగన్‌, అదిల్‌ రషీద్‌, సందీప్‌ లమిచ్చనే. 

Photo: FileShot