ట్విస్ట్ కు మరో ట్విస్ట్ : కోహ్లీకి షాక్ ఇచ్చిన హార్దిక్... 

ట్విస్ట్ కు మరో ట్విస్ట్ : కోహ్లీకి షాక్ ఇచ్చిన హార్దిక్... 

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు కెప్టెన్ కోహ్లీ షాక్ ఇచ్చాడు. అదేంటంటే... పాండ్యా తన అన్న క్రునాల్ పాండ్యా కు ఇచ్చిన  'జంపింగ్ పుష్-అప్స్' ఛాలెంజ్ ను కోహ్లీ ప్రయత్నించాడు. అయితే అందులోనే  ఓ ట్విస్ట్ కలిపాడు భారత సారథి. పాండ్యా చేసిన వీడియోలో గాల్లో ఎగురుకుంటూ  పుష్ అప్స్ చేసాడు, కానీ విరాట్ అలా గాల్లో ఎగురుకుంటూ పుష్-అప్స్ చేయడమే కాకుండా మధ్యలో చప్పట్లు కొట్టడం జోడించాడు. ఇక ఇప్పుడు ఆ ట్విస్ట్ కు మరో ట్విస్ట్ ఇచ్చాడు పాండ్యా . అయితే కోహ్లీ ఛాలెంజ్ కు సమాధానం ఆలోచించి  ప్రతిస్పందించడానికి పాండ్యా కు 2 రోజులు పట్టింది. ఈ సారి తన కొత్త వీడియోలో పుష్-అప్స్ తో పాటుగా హార్దిక్ పాండ్యా బ్యాక్-క్లాప్ ను జత చేసాడు. ఇక ఈ కొత్త ఛాలెంజ్ ను క్రునాల్ పాండ్యా మరియు భారత జట్టు సహచరుడు కెఎల్ రాహుల్ లకు ఇచ్చాడు  హార్దిక్ పాండ్యా. అలాగే దానికి 'నేను ఎప్పుడు మీ వెనుకే ఉంటాను'' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా యొక్క కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్ ఈ వీడియో పై స్పందిస్తూ "మై బెబు ది బెస్ట్" అని రాశారు. అయితే విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా బ్యాక్-క్లాప్ పుష్-అప్‌లను ప్రయత్నిస్తారా... లేదా పుష్-అప్‌లో మరో కొత్త వెర్షన్‌తో వస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.