ఐపీఎల్ కోసం చెమటలు కక్కుతున్న పాండ్యా...

ఐపీఎల్ కోసం చెమటలు కక్కుతున్న పాండ్యా...

భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి అందరికి తెలిసిందే. అయితే పాండ్యా మామూలుగానే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాడు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడడం తో సోషల్ మీడియాలో అభిమానులను అలరించాడు. ఇక మళ్ళీ వచ్చే నెల లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం జిమ్ లో చెమటలు కక్కుతున్నాడు పాండ్యా. ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఆ విండోలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనుంది. ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో ముఖ్య ఆటగాడైన పాండ్యా. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ లో రాణించడానికి తన జిమ్ లో కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అందులో పాండ్యా శరీరం మొత్తం చెమటతో కనిపిస్తుంది. ఇక పాండ్యా ప్రపంచ కప్ తర్వాత వెన్నెముక చికిత్స చేయించుకున్నాడు. అయితే ఆ తరువాత మళ్ళీ ఇప్పటివరకు మ్యాచ్ లు ఆడలేదు. అయితే గాయం నుండి కోలుకున్న పాండ్యా ఐపీఎల్ లో ఆడుదాం అనుకున్న కరోనా అడ్డుపడింది. మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ జరగనుండటంతో క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.