స‌ర్జరీ స‌క్సెస్‌.. ఆస్పత్రిలోనే హార్ధిక్ పాండ్యా

స‌ర్జరీ స‌క్సెస్‌.. ఆస్పత్రిలోనే హార్ధిక్ పాండ్యా

టీమిండియా ఆల్‌రౌండ్ హార్ధిక్ పాండ్యా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.. 2018 సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్‌ వెళ్లి.. ఆస్పత్రిలో చేరిన శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా.. తనకు జరిగిన సర్జరీ విజ‌య‌వంత‌మైన‌ట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. "తాను త్వర‌గా కోలుకోవాల‌ని విషెస్ చెప్పిన అందరికీ ధ‌న్యవాదాలు తెలిపిన పాండ్యా.. త్వర‌లోనే మ‌ళ్లీ మైదానంలో దిగుతానని పేర్కొన్నాడు. ఇక, పాండ్యా ట్వీట్‌కు రిప్లే ఇచ్చింది బీసీసీఐ.. విష్‌ యూ ఏ స్పీడ్ రికవరీ అని కామెంట్ పెట్టింది.. కాగా, పాండ్యా క‌నీసం 5 నెల‌ల పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందంటున్నారు.. భారత జట్టులో హార్ధిక్ స్థానం కీలకమైనది.. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ జట్టులో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.