హార్దిక్ పటేల్ మిస్సింగ్..! భార్య ఆందోళన..

హార్దిక్ పటేల్ మిస్సింగ్..! భార్య ఆందోళన..

పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కనిపించకుండా పోయాడట... దాదాపు 20 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదట.. ఈ మేరకు ఆయన భార్య కింజాల్ పటేల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తన భర్తను గుజరాత్ పాలకులు టార్గెట్ చేశారని.. దీంతో, 20 రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాటిదార్ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తిరగతోడి తన భర్త ఒక్కడినే టార్గెట్ చేశారని ఆమో వీడియో ఆరోపించారు.. గతంలో పాటిదార్ ఉద్యమంలో పనిచేసిన మరో ఇద్దరు.. బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తివేశారని.. కానీ, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న హార్దిక్ పటేల్‌ను వదలడంలేదన్నారు. ఇక, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హార్థిక్ పటేల్ ను జైలుకు పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు కింజాల్ పటేల్.