రోడ్డు ప్రమాదంలో హరికృష్ణకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణకు తీవ్ర గాయాలు

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తనయుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా నల్గొండ సమీపంలోని అన్నేవర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి హరికృష్ణను తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారును హరికృష్ణే నడుపుతున్నట్టు సమచారం. ప్రమాద సమాచరం తెలిసిన వెంటనే హరికృష్ణ సోదరి పురందేశ్వరి ఆస్పత్రికి బయలుదేరారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జనకిరామ్‌ మృతిచెందారు.