ఆయన నా కాళ్ళు మొక్కలేదు.. హరీశ్ రావు ఆగ్రహం

ఆయన నా కాళ్ళు మొక్కలేదు.. హరీశ్ రావు ఆగ్రహం

ఒక్కోసారి మీడియా సంస్థలు చూపే అత్యుత్సాహం కొందరికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటుంది.  తాజాగా ఇలాంటి ఇబ్బంది తెరాస నేత హరీశ్ రావుకు ఎదురైంది.  నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల్లో హరీశ్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.  కళ్యాణ్ ముగియగానే హరీశ్ రావు పైకి లేచి నిలబడ్డారు.  పక్కనే ఇంద్రకర రెడ్డి పైకి లేవబోతుండగా ఒంగి ఆయనకు చేయి అందించారు.  ఈ  దృశ్యాన్ని చూసిన ఓ మీడియా సంస్థ హరీశ్ కాళ్ళు మొక్కబోయిన ఇంద్రకరణ్ రెడ్డి అంటూ వార్తను ప్రచురించాయి. 

ఈ వార్తను చూసిన హరీశ్ రావు ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.  ఆ వార్తా పూర్తిగా అవాస్తవం అంటూ గౌరవ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేల మీది నుండి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా సాయపడ్డాను.  దీన్ని తప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు.  ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది బాధాకరం.  ఇకపై వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలి అని కోరారు.