వైభవంగా కోటిదీపోత్సవం...కార్తీక పౌర్ణమి స్పెషల్

వైభవంగా కోటిదీపోత్సవం...కార్తీక పౌర్ణమి స్పెషల్

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఇలకైలాసంలో జరుగుతోన్న ఈ ఉత్సవాన్నికి ప్రముఖులు తరలివస్తున్నారు.. పదవ రోజు కోటిదీపోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. పదవ రోజు కోటిదీపోత్సవం శ్రీ  శారద వైదిక స్మార్ధ విద్యాలయం ,వర్గల్ విద్యార్ధుల వేద పఠనంతో ప్రారంభంకాగా.. ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.

బాపు శాస్త్రీ బృందంచే భక్తి గీతాలు, బ్రహ్మశ్రీ శ్రీ జోన్నవిత్తుల రామలింగేశ్వ రావు వ్రవచనం, కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం, అమర్ నాధ్ హిమలింగానికి కోటి రుద్రాక్షల అర్చన, శ్రీశైల మల్లికార్జున కల్యాణోత్సవం నంది వాహనంపై ఉత్సవ మూర్తులు  ఊరేగారు. జ్వాలాతోరణ సహిత శ్రీశైలం ఉత్సవమూర్తుల నందివాహన సేవ ఆకట్టుకుంది. ఇక  పదవ  రోజు ఉత్సవాలకు కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామి, హల్దీపురం మఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామి, తెలంగాణ రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.