వాళ్లు కోటర్లను నమ్మితే... మేం నీళ్లను నమ్ముకున్నాం...

వాళ్లు కోటర్లను నమ్మితే... మేం నీళ్లను నమ్ముకున్నాం...

కాంగ్రెస్ పార్టీ నేతలు కోటర్ సీసాలు నమ్ముకున్నారు... తాము మాత్రం గోదావరి నీళ్లను నమ్ముకున్నామని వాఖ్యానించారు హరీష్‌రావు... సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ఏకలవ్యూల ఆత్మీయ సభకు హాజరైన ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు... ఈ సందర్భంగా మాట్లాడుతూ... 50 ఏళ్ల నుంచి నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కేలేదని మండిపడ్డారు. నర్సారెడ్డితోక పట్టు కొని ప్రతాప్ రెడ్డి ఓట్లు అడగడానికి వస్తుండు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని మండిపడ్డ ఆయన... రెప్ప పాటు కూడా కరెంట్ సమస్య లేదంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే అన్నారు. ఎవ్వరి స్థలంలో వారు ఇళ్లు కట్టుకుంటామంటే వారికి రూ. 5 లక్షల రుణం ఇస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టామని గుర్తు చేసిన హరీష్‌రావు... ప్రజల్లో విశ్వాసం పొందిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టు వ్యవస్థలో కూడా ఏకలవ్యూలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా టీఆర్ఎస్ దే అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు 90 శాతం సబ్సిడీ అందిస్తున్నామని... ఆంధ్ర నుండి నోట్లు, కోటర్ సీసలు వస్తున్నాయని వాటిని చూసి మోసపోకండి అని సూచించారు.