ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటాడు...

ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటాడు...

కరీంనగర్ దివంగత మాజీ ఎమ్మెల్యే కటారి దేవేందర్ రావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటాడు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హరీష్ రావు కరీంనగర్ లోని కటారి దేవేందర్ రావు స్వగృహంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కటారి దేవేందర్ రావు మృతి చాలా బాధాకరమన్నారు. కరీంనగర్ కు దేవేందర్ రావు రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ గా ఒకసారి, కరీంనగర్ శాసనసభ్యులుగా మరోసారి ఎన్నికై మంచి చేసి అనేక మంది హృదయాల్లో నిలిచారు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం కలవారు. పార్టీలకతీతంగా అందరూ కూడా ఇష్టపడే వ్యక్తి అని అన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా సాధారణ జీవితంతో అందరితో కలిసి ఉండే వ్యక్తి మరణం మాకు చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని హరీష్ రావు అన్నారు.

కటారి దేవేందర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా భౌతికంగా ప్రజల హృదయాల్లో మాత్రం మంచి మనిషిగా నిలిచిపోయారు అని హరీష్ రావు అన్నారు. నేను చదువుకునే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ గా కరీంనగర్ లోని పిల్లలు చాలా ఇష్టపడేవారు. కరీంనగర్ అభివృద్ధి చెందాలని చాలా సంతోషపడ్డాడు. టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో క్రియాశీలకంగా కేసీఆర్ తో పాటు కలిసి పని చేసిన వ్యక్తి దేవేందర్ రావు అని హరీష్ రావు తెలిపారు.