మెదక్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది

మెదక్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది

రాష్ట్రమంతా సారు.. కేసీఆర్ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. మెదక్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తెలిపారు. ఇక టార్గెట్ మెజార్టీలో జాతీయ రికార్డు అని అన్నారు. ప్రీతమ్ ముండే రికార్డును బ్రేక్ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బేకార్ అవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సెక్యూలర్ ఫ్రంట్ అవసరముందని అన్నారు. మోడీ, రాహుల్ లను పక్కన పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. మోడీ చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ అని ఎద్దేవా చేశారు. విదేశాల్లో తిరగడం, మీడియాలో కనిపించడం తప్ప దేశానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. తెలంగాణ దేశానికి మోడల్ అయ్యింది. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి ఓటు వేయొద్దని హరీష్ రావు పిలుపునిచ్చారు.