మహా కూటమి అధికారంలోకి వస్తే అంతే..

మహా కూటమి అధికారంలోకి వస్తే అంతే..

మహా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తప్పదన్నారు అపధర్మ మంత్రి హరీశ్‌రావు.  సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కురుమల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభలో మాట్లాడిన హరీష్ రావు,  కేసీఆర్‌ను దీవించి సంక్షేమాన్ని కోరుకుంటారో ,కూటమిని నమ్మి సంక్షోభాన్ని తెచ్చుకుంటారో ప్రజలే ఆలోచించుకోవాలన్నారాయన. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధే జరగలేదని అసత్య ప్రచారం చేస్తున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. కూటమికి ఓటు వేస్తే ప్రాజెక్టులు ఆగిపోవడంతోపాటు..  సాగునీటి కష్టాలు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు రద్దవడం ఖాయమని పేర్కొన్నారు. అవకాశవాద పొత్తులతో గ్రామాల్లోకి వస్తున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు హరీష్ రావు.