కృతజ్ఞతలు తెలిపిన హరీష్‌రావు..

కృతజ్ఞతలు తెలిపిన హరీష్‌రావు..

లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తప్రభాకర్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు కొత్త ప్రభాకర్‌రెడ్డి. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించిన హరీష్‌రావు.. అనుకున్న రీతిలో అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటూ మెదక్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కృషి చేశాం.. కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసంతో మెదక్‌లో  గెలుపు అందించారని తెలిపారు. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ కు ప్రజల సంపూర్ణ దీవెనలు ఉన్నాయన్న హరీష్‌రావు... ప్రజల విశ్వాసం నిలబెట్టుకుంటాం.. ఈ విజయం టీఆర్ఎస్ కార్యకర్తలది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అద్భుత విజయం సాధిస్తాం. మెదక్ లో 3 జడ్పీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.