లక్ష మెజార్టీతో ఆరోసారి విజయం

లక్ష మెజార్టీతో ఆరోసారి విజయం

తెలంగాణ మంత్రి హరీష్‌రావు లక్ష మెజార్టీతో ఆరోసారి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు. ఈ ఎన్నికల్లో 1,06,816 ఓట్ల మెజార్టీ సాధించి తెలంగాణలో సరికొత్త రికార్డు సృష్టించారు. పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీష్ రావుకు పోలయ్యాయి. 2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన హరీశ్‌రావు తర్వాత వరుస విజయాలు సాధిస్తున్నారు. 2008, 2010 ఉపఎన్నికలతోపాటు 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించినట్లైంది.