అతను మెగా హీరోలకే పరిమితమయ్యాడే..!!

అతను మెగా హీరోలకే పరిమితమయ్యాడే..!!

గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం.  ఈ సినిమా మానియా మాములుగా లేదు.  వావ్ అనిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమా చేశారు.  ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.  దీని తరువాత ఈ దర్శకుడు మరో మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ చేశారు.  అనంతరం అల్లు అర్జున్ తో డీజే సినిమా చేశారు.  

పర్వాలేదని అనిపించింది.  టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్రయత్నం చేసినా కుదరలేదు.  ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా  షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  మరి ఈ సినిమా తరువాతైనా మెగా కాంపౌండ్ నుంచి బయటకు వస్తారా లేదంటే అక్కడే ఉంటారా చూడాలి.