కేటీఆర్‌కు హరీష్‌ విషెస్

కేటీఆర్‌కు హరీష్‌ విషెస్

ఇవాళ జన్మదినం జరుపుకొంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్‌ కలకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈమేరుకు హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.