గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎంపీ వినోద్

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎంపీ వినోద్

హరిత హారం గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్వీకరించారు. ఉదయం తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రమేశ్ బాబు, వి. సతీశ్ కుమార్‌లకు హరిత సవాల్ విసిరారు. ఈ విషయాన్ని ఎంపీ ట్విటర్ ద్వారా తెలిపారు.