ధోనీ, రోహిత్ కంటే ముందే.. హర్మన్ ప్రీత్‌కౌర్ అరుదైన రికార్డు..

ధోనీ, రోహిత్ కంటే ముందే.. హర్మన్ ప్రీత్‌కౌర్ అరుదైన రికార్డు..

మహిళా క్రికెటర్‌, టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అరుదైన ఘనత సాధించారు. వంద అంతర్జాతీయ టీ-ట్వంటీ మ్యాచ్‌లు ఆడిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించారామె. ధోనీ, రోహిత్‌ శర్మల కంటే ముందు హర్మన్‌ ప్రీత్‌ ఈ మైలు రాయిని అందుకోవడం విశేషం. ధోనీ, రోహిత్‌ శర్మ ఇంత వరకూ 98 చొప్పున టీ-ట్వంటీ మ్యాచ్‌లు ఆడారు. సూరత్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో హర్మన్‌ ప్రీత్‌కు ఈ ఘనత సొంతమైంది. ఈ సందర్భంగా హర్మన్‌కు హెడ్‌ కోచ్‌ రమణ్‌ ప్రత్యేక క్యాప్‌ను అందజేశారు. ఈ వీడియోను BCCI తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.