కోచ్‌గా అతనే కావాలి...

కోచ్‌గా  అతనే కావాలి...

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు.. టీమిండియా సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్‌ను తుది జట్టు నుండి పక్కకు పెట్టడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడప్పుడే పరిష్కారం అయ్యేలా కనిపించట్లేదు. తాజాగా టీ20 టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన కోచ్‌గా రమేష్ పొవారే కావాలంటూ బీసీసీఐకి లేఖ రాశారు. కోచ్ పొవార్‌ను తొలగించి కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో.. హర్మన్‌ప్రీత్ లేఖ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

'కోచ్ పొవార్ సారథ్యంలో గత కొంత కాలంగా ఉమెన్స్ టీమ్ ఎంత బాగా రాణిస్తోందో అందరికీ తెలిసిందే. వరల్డ్‌కప్ లో బాగా రాణించాం. అయితే దురదృష్టవశాత్తు సెమీఫైనల్లో ఓడిపోవడం. కోచ్ పొవార్ మమ్మల్ని మంచి ప్లేయర్స్‌గా తీర్చిదిద్దారు. టీంలో ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు. పూర్తి క్రికెటింగ్ లాజిక్ ఆధారంగానే మిథాలీని తుది జట్టు నుండి తప్పించాం.. ఆ సమయంలో తనతో పాటు స్మృతి, సెలక్టర్ సుధా షా, కోచ్, మేనేజర్ అందరూ ఉన్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. 15 నెలల్లోనే మరో వరల్డ్ టీ20 ఉన్న నేపథ్యంలో కోచ్ పొవార్‌ను తొలగించాల్సిన అవసరం లేదని.. కోచ్‌గా పొవార్‌నే కొనసాగించాలని' హర్మన్ ఆ లేఖలో పేర్కొంది.