ఓ గాడిద.. ఓటు కథ..!

ఓ గాడిద.. ఓటు కథ..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ఎన్నికల్లో ఎలాంటి నేతను ఎన్నుకోవాలి? ఎవరికి ఓటు వేస్తే ఐదేళ్లు ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు? ఎవరికి ఓటు వేస్తే నట్టేట ముంచేస్తాడు? ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం. కానీ, ఓటు వేసిన తర్వాత.. ఎలా? దించాలనే ప్రయత్నం చేసినా వ్యర్థప్రయసే..! ఓటు వేసే ముందే సరైన నాయకుడిని గద్దెనెక్కించే విధంగా మీ నిర్ణయం ఉండాలి..! కానీ, అయ్యో! వీడికి ఓటువేశామే.. అనే బాధ ఐదేళ్లు మిమ్మల్ని వెంటాడ కూడదు. ఓటు హక్కు ప్రాముఖ్యత.. సరైన వ్యక్తి ఎన్నికోవాలంటూ ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖులు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయాంక.. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అందరినీ ఆలోచింపజేస్తోంది. వాటర్ ట్యాంక్‌పై ఉన్న ఓ గాడిద ఫొటోను షేర్ చేసిన ఆయన.. దానిని ఎలా దించాలనే ఆలోచన చేయడం కాదు.. అసలు అది ఎవరి సహాయంతో పైకి ఎక్కింది అని ఆలోచించాలి.. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని ట్వీట్ చేశారు.