బోటు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో పిటీషన్

బోటు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో పిటీషన్

గోదావరి నదిలో కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ పిటిషన్‌ ని దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలను వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నేవీ, ఎన్డీఆర్ఎఫ్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ హర్ష కుమార్ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. బోటు వెలికితీతపై నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

మరో పక్క బోటు ప్రమాద ఘటనకు సంబందించి బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 90 మందికి పైగానే ఉంటుందని హర్షకుమార్ అన్నారు. ఇక హర్షకుమార్ రాజమండ్రిలోని న్యాయస్థానం ముందు ఉన్న ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో కోర్టు సిబ్బంది తో మహిళలతో దురుసుగా ప్రవర్తించిన కారణంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఇదే సమయంలో ఆయన బోటు ప్రమాద ఘటనపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
 ఈ నేపథ్యంలో, హర్షకుమార్‌ పై పోలీసు కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసు టీములు గాలిస్తున్నాయి.