కేటీఆర్ కు మరో అరుదైన గుర్తింపు

కేటీఆర్ కు మరో అరుదైన గుర్తింపు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న హార్వర్డ్ ఇండియా వార్షిక సదస్సుకు హాజరుకావాలని హార్వర్డ్ యూనివర్సిటి ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 16,17 తేదిల్లో అమెరికాలోని మసాచుసెట్స్ లో జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, యువ వృత్తి నిపుణులు మొత్తం వెయ్యి మంది పాల్గొననున్నారు. 'ఇండియా ఎట్ ఇన్ ఫ్లెక్షన్ పాయింట్' అనే అంశంపై జరగనున్న ఈ సదస్సుకు ప్రత్యేక వక్తగా హజరై ప్రసంగించాలని కేటీఆర్ ను కోరారు.