మహ్మద్‌ షమీకి మరో షాక్...

మహ్మద్‌ షమీకి మరో షాక్...
ఈ రోజు మహ్మద్‌ షమీ, జహన్‌ వివాహమై నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భార్య హసీన్‌ జహాన్‌కు శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేశాడు షమీ. కానీ ఇవేమి పట్టించుకోకుండా తాజాగా షమీ భార్య హసీన్‌ జహాన్‌ షమీపై మరో కేసు దాఖలు చేసింది. ఈ రోజు కోల్‌కతాలోని అలీపూర్‌ కోర్టులో గృహహింస చట్టం 2005 కింద జహాన్ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌లో తనకు, తన కూతురి పోషణకు షమీ భరణం చెల్లించేలా చూడాలని కోరింది. అయితే తన అకౌంట్‌ నుంచి డబ్బులు తీసుకోకుండా షమీ బ్యాంకులకు సమాచారం ఇచ్చాడని జహాన్‌ తెలిపింది. తాజాగా చెక్‌ సాయంతో డబ్బుతీసుకోవాలని ప్రయత్నించినా.. డబ్బులు రాలేదని తెలిపింది. ఈ కారణంగానే భరణం కోసం కోర్టుకెక్కినట్లు వెల్లడించింది.