మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తా

మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తా

తృణమూల్ కాంగ్రెస్ నేతలను 'లూటీదారులు'గా ప్రధాని మోడీ పేర్కొనడంపై ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. మోడీకి ప్రజాస్వామ్యం దెబ్బ రుచి చూపిస్తానని అన్నారు. పురూలియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, డబ్బు తనకో లెక్క కాదని కుండబద్ధలు కొట్టారు. ఆ కారణంతోనే నరేంద్ర మోడీ బెంగాల్ వచ్చి టీఎంసీని టోల్ కలెక్టర్ గా నిందారోపణలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏమిటో, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధానికి తాను చూపించాలనుకుంటున్నట్లు మమత చెప్పారు. జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్న వారిని మమత అరెస్టు చేస్తున్నారంటూ మోడీ చేసిన ఆరోపణలపై స్పందించారు. రాముడి పేరు చెప్పుకునే మీరు కనీసం ఒక్క రామాలయమైనా కట్టించారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్లకు రాముడు గుర్తుకొస్తాడని, రాముడిని ఎన్నికల ఏజెంటుగా చేయడం బీజేపీకి అలవాటని మమత దయ్యపట్టారు.