'మోడీ.. మీకు సిగ్గు అనేదే లేదా..?'

'మోడీ.. మీకు సిగ్గు అనేదే లేదా..?'

రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరడంలో ఆలస్యానికి ప్రధాని మోడీయే కారణమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాఫెల్‌ జెట్స్‌ ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండేవని నిన్న రాత్రి ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే రాహుల్‌ కౌంటర్‌ ఇచ్చారు. 'ప్రధానీ.. మీకు సిగ్గు అనేదే లేదా? రూ.30 వేల కోట్లు దొంగిలించి మీ ఫ్రెండ్‌ అనిల్‌ అంబానీకి ఇచ్చారు. రాఫెల్‌ జెట్స్‌ ఆలస్యానికి మీరే కారణం. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ లాంటి సైనికులు ప్రాణలను పణంగా పెట్టి కాలం చెల్లిన యుద్ధవిమానాలను నడపడానికి కారణం మీరు..' అని రాహుల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు.