అధికారి కాళ్లు పట్టుకున్న కార్పోరేటర్

అధికారి కాళ్లు పట్టుకున్న కార్పోరేటర్

అధిక లోడ్ తో వెళ్తున్న వాహనాలను రోడ్లపైకి అనుమతించవద్దంటూ ఓ కార్పోరేటర్ రవాణా అధికారి కాళ్లు పట్టుకున్నాడు. ఇసుక, కంకరతో ఉన్న టిప్పర్లు రోడ్లపై తిరుగుతుండటంతో రహదారులు పాడువుతున్నాయని, దీంతో రోడ్లపై ప్రమాదాలు జరిపి అమాయకమైన వాహనదారులు చనిపోతున్నారంటూ హయత్ నగర్ కార్పోరేటర్ సామ తిరుమల్ రెడ్డి ఇబ్రహింపట్నం రవాణా శాఖ అధికారి కాళ్లు పట్టుకున్నాడు. దయచేసి అటువంటి వాహనాలను రోడ్డుపైకి రాకుండా కేసులు నమోదు చేయాలని ప్రాధేయపడ్డాడు. కార్పోరేటర్ చెప్పిన విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. అధిక లోడ్ తో ఉన్న వాహనాలు రోడ్డుపైకి వస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.