సైకో శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలి

సైకో శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రం హాజీపూర్‌ లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ముగ్గురు చిన్నారులపై దారుణంగా ఆత్యాచారం జరిపి, హత్య చేసిన సైకో శ్రీనివాసరెడ్డిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. బొమ్మలరామారం మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి గుడిబావి చౌరస్తా వద్ద అమరణ నిరాహర దీక్షకు దిగారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ న్యాయ పోరాటానికి మండల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని హామీలిచ్చిన అధికారులు జాడ లేకుండా పోయారని విమర్శించారు. పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎమ్మెల్యే సునీత దగ్గరికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పినా బాధితులు ససేమిరా అన్నారు. ఇంతవరకు పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఏం మాట్లాడతారంటూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.