బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

మావోయిస్టుల హిట్‌ లిస్ట్‌లో ఉన్న తనకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడుకు ఒక అడిషనల్‌ ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారి సీఎస్‌ఓలుగా ఉండేవారు. వీరికి అదనంగా ముగ్గురు ఆర్‌ఐలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు కానిస్టేబుళ్ల చొప్పున ఉండేవారు. కానీ.. ఈసారి తనకు  ఒక డిఎస్పీతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రతా సిబ్బందిగా ప్రభుత్వం కేటాయించిందని, దీనిని పునఃసమీక్షించాలని కోరుతూ బాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇవాళ విచారించిన న్యాయస్థానం.. రేపటికి వాయిదా వేసింది.