హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఇష్యూ 25న

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఇష్యూ 25న

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 25న ప్రారంభం కానుంది. పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న అతి పెద్ద రెండో మ్యూచువల్‌ ఫండ్‌ ఇదే. ఈ ఫండ్‌ ప్రస్తుతం రూ. 3 లక్షల కోట్లను నిర్వహిస్తోంది. నంబర్‌ వన్‌ ఫండ్‌ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ రూ. 3.06 కోట్లను నిర్వహిస్తోంది.పబ్లిక్‌ ఆఫర్‌ ధర శ్రేణి రూ. 1,095 నుంచి రూ. 1,100 అని కంపెనీ పేర్కొంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 2,800 కోట్లను సమీకరించాలన్నది హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ భావిస్తోంది.  పబ్లిక్‌ ఆఫర్‌ కింద కనీసం రూ. 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ తనకున్న 85.92 లక్షల షేర్లను అమ్ముతుండగా, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ తనకున్న 1.68 కోట్ల షేర్లను అమ్ముతోంది.