హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం రూ.5006 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం రూ.5006 కోట్లు

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ. 5006 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే సమయంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం రూ.11,763 కోట్లు  ఆర్జించింది. డిపాజిట్లపై బ్యాంక్‌ ఇచ్చే వడ్డీ, రుణాలపై వచ్చే వడ్డీ మధ్య వ్యత్యాసమే నికర వడ్డీగా పరిగణిస్తారు. ప్రొవిజన్స్‌ కింద రూ. 1820 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రత్యేక  రుణ నష్టం ప్రొవిజన్ రూ. 1572 కోట్లు కాగా, రూ. 247 కోట్లు సాధారణ ప్రొవిజన్స్‌.  బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు రూ. 1.33 శాతంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది.