ధోని వారసుడు అతడేనట.!

ధోని వారసుడు అతడేనట.!

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని ఎంత గొప్ప ఆటగాడో తెలిసిందే. ధోని సారథ్యంలోనే టీం ఇండియా రెండు సార్లు ప్రపంచ కప్ సాధించడంతో పాటు ఓ సారి ఛాంపియన్ ట్రోఫీని కూడా ముద్దాడింది. ఇక బెస్ట్ ఫినిషర్ అని ప్రపంచవ్యాప్తంగా తెల్సిన సంగతే. ఎన్నో సార్లు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీయే ఆదుకున్నాడు. కాగా ధోని ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండటంతో ఆయన లేని లోటు కన్పిస్తోంది. ఇక ధోని స్థానాన్ని భర్తీ చేసేది రిషబ్ పంత్ ఏ అని అంతా అనుకున్నారు. ప్రస్తుతం అతని ఆటతీరు అంత బాగా లేకపోవడంతో తెరపైకి మరో పేరు వచ్చింది. అతడే రియాన్ పరాగ్ ఈ పేరును క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రియాన్ పరాగ్ ఐపీఎల్ 2019లో ఆడి తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 7 మ్యాచ్ లు ఆడిన ఈ యువ క్రికెటర్ 160 పరుగులు సాధించాడు. ఇక ఉతప్ప తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ కూడా పరాగ్ ఆటను మెచ్చుకున్నాడు.